గరుడ గమన గరుడధ్వజ
నరహరి నమోనమో నమో ||

కమలాపతి కమలనాభా
కమలజ జన్మకారణిక |
కమలనయన కమలాప్తకుల
నమోనమో హరి నమో నమో ||

జలధి బంధన జలధిశయన
జలనిధి మధ్య జంతుకల |
జలధిజామాత జలధిగంభీర
హలధర నమో హరి నమో ||

ఘనదివ్యరూప ఘనమహిమాంక
ఘనఘనా ఘనకాయ వర్ణ |
అనఘ శ్రీవేంకటాధిపతేహం
నమో నమోహరి నమో నమో ||